శ్రీశైలంలో కార్తీక దీపారాధన | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో కార్తీక దీపారాధన

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

శ్రీశైలంటెంపుల్‌: కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మొదటి బుధవారం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు క్షేత్రానికి తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఉత్తర మాఢవీధిలో, గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక నోములు నోచుకున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని నెలకొల్పారు. కార్తీక దీప ప్రజ్వలనకు ముందుగా అర్చక స్వాములు సంకల్పం పఠించి, కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిపించారు. అనంతరం దీప ప్రజ్వలన, దీపారాధన జరిపించారు. ఆకాశదీప కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు పాల్గొన్నారు. ఈ ఆకాశ దీపాన్ని వెలిగించినా, చూసినా సకల పాపాలు నశించి అనంతపుణ్యం కలుగుతుందని, వ్యాధులు తొలగి ఆయురారోగ్యాలు చేకురుతాయని విశ్వాసం ఉంది.

ఆలయ ధ్వజస్తంభంపై

ఆకాశ దీపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement