సమస్యలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలి

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

● న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

● న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

కర్నూలు: పిల్లలకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నా రు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గూడూరు మండలం గుడిపాడు గ్రామంలోని జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లో బుధవారం సురక్షిత్‌ బచ్చన్‌, అభియాన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సురక్షిత్‌ బచ్చన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ, ఆన్‌లైన్‌ భద్రత, లైంగిక వేధింపులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, ఫిర్యాదు చేసే విధానం, ఉ చిత న్యాయ సహాయం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పిల్లలు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ శివరామచంద్రరావు మాట్లాడుతూ.. బాలల భద్రత, హక్కుల పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. లీగల్‌ ఎయిడ్‌ సభ్యుడు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, స్కూల్‌ ఇన్‌చార్జి హెడ్‌ మాస్టర్‌ పర్‌సిస్‌, ప్యానల్‌ లాయర్‌ రామపుల్లయ్య, పారా లీగల్‌ వలంటీర్స్‌ గోపి, హేమంత్‌, అనీఫ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement