మాతా శిశు మరణాల తగ్గింపునకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

మాతా శిశు మరణాల తగ్గింపునకు ప్రత్యేక చర్యలు

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

కర్నూలు(సెంట్రల్‌): మాతా శిశు మరణాల తగ్గిపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై సంబధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదోని డివిజన్‌, పత్తికొండ, కర్నూలు అర్బన్‌ ప్రాంతాల్లో టీనేజ్‌ గర్భధారణలు, బాల్య వివాహాల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేద ప్రజలపై సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఉదయం 9 గంటలకే అంగన్‌వాడీ కేంద్రాలను తెరవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో గర్భిణుల నమోదు 98 శాతం లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమావేశంలో డిఎంహెచ్వో డాక్టర్‌ కామేశ్వర ప్రసాద్‌, అదనపు డిఎంహెచ్వో డాక్టర్‌ భాస్కర్‌, ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (ఇంచార్జి) నరసమ్మ, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఉమ, జిల్లా గణాంక అధికారి డాక్టర్‌ హేమ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు ఉచిత బస్సు సదుపాయం

శ్రీశైలంటెంపుల్‌: కార్తీక మాసోత్సవాల సందర్భంగా భక్తులకు మంగళవారం నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాతాళగంగమెట్ల మార్గం నుంచి నంది సర్కిల్‌, గంగాధర మండపం, ఉచిత క్యూలైన్‌, లడ్డూ కౌంటర్ల వరకు ఈ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement