గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

నందికొట్కూరు: నందికొట్కూరు నుంచి ఆత్మకూరు పోయే రహదారి పక్కన ఓ దిబ్బలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైనట్లు నందికొట్కూరు పోలీసు లు మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 75 –80 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై తెల్లని కాటన్‌ బనియన్‌ ధరించిఉన్నట్లు తెలిపారు. ఎత్తు 5.3 అడుగులు, చామన చాయ కలిగి ఉండి తెల్లని గడ్డం 6 ఇంచులు కలిగి ఉన్నాడని, తలపై నలుపు, తెలుపు వెంట్రుకలు 8 ఇంచులు కలిగి ఉండి స్థానిక కేజీ రోడ్డు ఆత్మకూరు పోయే రస్తాలో గవర్నమెంట్‌ ప్రభుత్వ బాలికల హాస్టల్‌ పక్కన గల ఖాళీ స్థలం దిబ్బలో చనిపోయి ఉన్నాడని చెప్పారు. మృతుడి వివరాలు తెలిసి న వారు నందికొట్కూరు పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సెల్‌ 91211 01187 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement