శ్రీశైలంలో అఖండ శివభజనలు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో అఖండ శివభజనలు

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

నిర్మాణాలు వేగవంతం చేయండి

శ్రీశైలంటెంపుల్‌: లోక కల్యాణం కోసం కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైల దేవస్థానం శివచతుస్సప్తాహ భజనలు ప్రారంభించింది. మంగళవారం నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు భజనలు నిర్వహిస్తారు. ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పం పఠించారు. భజన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జపిరించారు. అనంతరం శివప్రణవ పంచాక్షరీ నామ అఖండ శివభజన ప్రారంభించారు. ఈ భజనలలో కర్నూలు జిల్లాకు చెందిన మూడు బృందాలకు, కర్ణాటకకు చెందిన మూడు బృందాలకు అవకాశం కల్పించారు. ప్రారంభ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కోడె కాంతివర్ధిని, స్వామివారి ఆలయ ప్రధానార్చకులు హెచ్‌.వీరయ్యస్వామి, అర్చకస్వాములు, సిబ్బంది పాల్గొన్నారు.

యాళ్లూరులో చైన్‌స్నాచింగ్‌

గోస్పాడు: మండలంలోని యాళ్లూరు గ్రామంలో మంగళవారం మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లినట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన పోగుల చంద్రకళ ఇంటి వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తాగేందుకు నీరు అడిగాడు. ఆమె నీరు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్తుండగా వెనక నుంచి మెడలోని బంగారు చైన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించి చైన్‌ను గట్టిగా పట్టుకోవడంతో రెండుగా తెగిపోయింది. చేతికి వచ్చిన సగభాగంతో దుండగుడు పరారయ్యాడు. చోరీకి గురైన బంగారు విలువ రూ.60 వేల వరకు ఉంటుందని తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సునీల్‌షెరాన్‌ గ్రామానికి వచ్చి ఘటన జరిగిన తీరుపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి భర్త పోగుల చంద్రశేఖర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

రాష్ట్ర క్రికెట్‌ జట్టులో

పత్తికొండ బాలిక

పత్తికొండ/నంద్యాల(న్యూటౌన్‌): పత్తికొండ పట్టణానికి చెందిన క్రికెటర్‌ లిఖిత ఆంధ్రప్రదేశ్‌ అండర్‌–17 మహిళల క్రికెట్‌ జట్టుకు ఎంపికై ంది. మంగళవారం విజయవాడలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ఆ విద్యార్థినికి జాతీయ జట్టులో అవకాశం కల్పించారు. పత్తికొండకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు రాఘవేంద్ర, హరిలక్ష్మి దంపతులు కుమార్తె లిఖిత చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి చూపుతుండటంతో తల్లిదండ్రులు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ప్రోత్సహించారు. ప్రస్తుతం ఈమె నంద్యాలలో నలంద కళాశాలలో చదువుతోంది. కోచ్‌ ప్రసన్నకుమార్‌ వద్ద శిక్షణ పొందుతూ ఈ స్థాయికి చేరుకుంది. ఓపెనింగ్‌ బ్యాటర్‌గా రాణిస్తున్న లిఖిత ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు జమ్మూ కశ్మీర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున లిఖిత ప్రాతినిథ్యం వహించనున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. జాతీయ స్థాయిలో జట్టుకు ఎంపిక కావడంతో పట్టణ ప్రముఖులు, ఉపాధ్యాయులు, క్రీడాసంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

కర్నూలు కల్చరల్‌: దేవదాయ శాఖ పరిధిలో జరుగుతున్న ఆలయాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ కమిషనర్‌ ఎం.రామాంజనేయులు ఆదేశించారు. మంగళవారం కర్నూలు డీసీ కార్యాలయంలో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ఉమ్మడి జిల్లాల ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో నా ణ్యత పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొన్ని చోట్ల నిర్మాణాలు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలన్నా రు. ఎస్టిమేషన్స్‌ను సకాలంలో వేసి ఈఓలకు అందరూ సహకరించాలన్నారు. సమీక్షలో కర్నూలు డీఈఈ శ్రీనివాస ప్రసాద్‌, ఏఈలు పాల్గొన్నారు.

బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి

ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇమ్మానియేలు (38) మృతి చెందాడు. మండలంలోని చింతకొమ్ముదిన్నెకు చెందిన ఇమ్మానియేలు గడేకారి పనికి పట్టణానికి వచ్చాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా పట్టణ శివారులోని ఇస్కాన్‌ దేవాలయం వద్ద బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఇమ్మానియేలును 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

లిఖిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement