నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

నంద్యాల(న్యూటౌన్‌):నేల ఆరోగ్యా న్ని కాపాడుకోవడం, భూసార క్షీణతను అరికట్టడం, రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడమే ఖేత్‌ బచావో అభియా న్‌‘ ముఖ్య ఉద్దేశం అని రీసెర్చ్‌ అసో సియేట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.జయలక్ష్మి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ప్రాంతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పొలం సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. డైరెక్టర్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమం అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. దేశంలో సుమారు 30 శాతం సాగు భూమి క్షీణత, ఎడారీకరణ వంటి సమస్యలను ఎదుర్కొంటోందని, నేల కోత, అడవుల నరికివేత తదితర కారణాలతో భూసారం దెబ్బతింటోందన్నారు. భవిష్యత్‌ తరాలకు సారవంతమైన భూమిని అందించాలంటే నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నేలలో సేంద్రియ కార్బన్‌ శాతాన్ని పెంచడం, భూసార పరీక్షల ఆధారంగా సమతుల్యంగా ఎరువులను వినియోగించడం, సాయిల్‌ హెల్త్‌ కార్డుల సూచనలను పాటించడం, పంట మార్పిడి విధానాలను అవలంభించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. మహానంది అగ్రికల్చరల్‌ కాలేజ్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ శ్యామ్‌రాజ్‌ నాయక్‌ మాట్లాడుతూ.. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదని, మానవాళి మనుగడకు, ఆహార భద్రతకు ప్రధాన ఆధారమన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో నెలకొన్న సవాళ్లకు రైతులు, శాస్త్రవేత్తలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను గుర్తించి పరిష్కారం దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధిక దిగుబడుల కోసం విచక్షణారహితంగా రసాయనాలను వినియోగించడం వల్ల దీర్ఘకాలంలో వ్యవసాయ భూములపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సాహించాలన్నారు. అనంతరం ఖేత్‌ బచావో బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. రైతులకు భూసార అవగాహన పత్రాలను పంపిణీ చేశారు. కె. బాలా మద్దిలేటి, ఐఎఫ్‌ఎన్‌ కోఆర్డినేటర్‌, నంద్యాల, డి. సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement