మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మి కేంద్రం శ్రీమఠంలో దీపావళి పాడ్యమి పురస్కరించుకుని మంగళవారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరిగాయి. బంగారు మండపంను పండ్లతో అలకరించారు. మూలరామ, దిగ్విజయరామ, జయరామ దేవుళ్ల సంస్థాపన విగ్రహాలకు మహాపంచామృతాభిషేకం నిర్వహించారు. గంధ లేపనం సమర్పించి, నారికేళాలతో జలాభిషేకం, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో విశిష్ట పూజలు చేపట్టారు. ఈ మహాభి షేకం ఏడాదికి రెండు పర్యాయాలు మాత్రమే, శ్రీరామనవమి రోజున, రెండవది దీపావళి బలిపాడ్యమి పర్వాదినాన నిర్వహిస్తారు. పీఠాధిపతి మూలరాములకు మంగళ హారతి గావించారు. భక్తులకు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
– శ్రీమఠంలో కార్తీక దీపాత్సోవాల్లో భాగంగా గ్రామ దేవత మంచాలమ్మ మంగళవారం మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు కుంకుమార్చన, అభిషేకం, మంగళహారతి గావించారు.


