పకడ్బందీగా జనగణన | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా జనగణన

Nov 10 2026 1:31 AM | Updated on Nov 10 2026 1:31 AM

కర్నూలు(సెంట్రల్‌): జనాభా గణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి సూచించారు. సోమవారం బృందావన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జిల్లా స్థాయి జనగణన అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 2027 జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలను తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. స్వీయ గణనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటా తిరిగి కుటుంబాల్లోని ప్రజల వివరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. 2027 మార్చి ఒకటో తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు పుట్టిన, చనిపోయిన వారి వివరాలను జనాభా సేకరణలో లిఖించాల్సి ఉందన్నారు. సేకరించిన వివరాలపై మార్చి 1 నుంచి 5వ తేదీ మధ్య ఏమైనా సవరణలు చేసుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. జనగణన నిర్వహణపై రెండు రోజుల పాటు అందించే శిక్షణను అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డివిజన్ల వారీగా ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, సీపీఓ, డీఆర్‌ఓ తదితర అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీవో అరుణ దేవి, కర్నూలు ఆర్డీఓ సందీప్‌ కుమార్‌, జిల్లా సెన్సస్‌ ఇన్‌చార్జ్‌ ఎన్‌. దీపక్‌ భరద్వాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement