ఇద్దరు చిన్నారులకు మెదడువాపు వ్యాధి | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు చిన్నారులకు మెదడువాపు వ్యాధి

Nov 10 2026 1:31 AM | Updated on Nov 10 2026 1:31 AM

● ఇద్దరూ కౌతాళానికి చెందినవారు

● కర్నూలు జీజీహెచ్‌లో ఇద్దరికీ చికిత్స

కర్నూలు(హాస్పిటల్‌): ప్రాణాంతక మెదడు వాపు వ్యాధి ఇద్దరు చిన్నారులను పట్టిపీడిస్తోంది. గ్రామాల్లో నెలకొన్ని అపరిశుభ్ర వాతావరణంతో దోమకాటు వల్ల వచ్చే ఈ వ్యాధి ప్రస్తుతం ఈ ఇద్దరు చిన్నారులను అంపశయ్యపై పడుకోబెట్టింది. జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన కౌతాళానికి చెందిన బసవ, ఎల్లమ్మ దంపతుల కుమారుడైన బసవ(3) గత పది రోజులుగా తీవ్ర జ్వరంతో బాదపడుతుండటంతో తల్లిదండ్రులు స్థానికంగా, అనంతరం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గత మంగళవారం కర్నూలు జీజీహెచ్‌కు రెఫర్‌ చేశారు. ప్రస్తుతం ఆ బాలుడు ప్రభుత్వ ఆసుపత్రిలోని పీఐసీయులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. అలాగే కౌతాళానికి చెందిన ఈరన్న, మంగమ్మల కుమార్తె అయిన గాయత్రి(1) గత దసరా పండుగ సమయం నుంచి జ్వరంతో బాధపడుతుండగా స్థానికంగా చికిత్స చేయించినా తగ్గకపోవడంతో ఆదోనికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వారం క్రితం కర్నూలు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఇక్కడి పిల్లల వైద్యులు వీరి లక్షణాలను బట్టి రక్తపరీక్షలు చేయించగా మెదడువాపు(జేఈ) నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మేరకు వారికి అవసరమైన వైద్యం అందిస్తున్నారు. వీరిలో వేదాంత్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

గాయత్రి

వేదాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement