లీగల్‌ సర్వీసెస్‌తో సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

లీగల్‌ సర్వీసెస్‌తో సత్వర న్యాయం

Nov 10 2026 1:31 AM | Updated on Nov 10 2026 1:31 AM

కర్నూలు: లీగల్‌ సర్వీసెస్‌తో ప్రజలకు సత్వర న్యా యం జరుగుతుందని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో కార్యక్రమాన్ని 4వ అదనపు జిల్లా జడ్జి టి.లీలావతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్‌ 9వ తేదీన జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఏసీబీ కోర్టు అదనపు జిల్లా జడ్జి శ్రీవిద్య, ఫోక్సో కోర్టు స్పెషల్‌ అదనపు జడ్జి రాజేంద్రబాబు, 7వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకటహరినాథ్‌, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి, ఎకై ్సజ్‌ మెజిస్ట్రేట్‌ అనిల్‌ కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చంద్రు డు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీగల్‌ సర్వీసెస్‌ గోడ పత్రికలను ఆవిష్కరించి న్యాయవాదులు, పారా లీగల్‌ వాలంటీర్స్‌తో పా టు కొండారెడ్డిబురుజు వరకు ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement