తపాలా శాఖలో రప్రాంౖచైజ్‌ 2.0 పథకం | - | Sakshi
Sakshi News home page

తపాలా శాఖలో రప్రాంౖచైజ్‌ 2.0 పథకం

Nov 10 2026 1:13 AM | Updated on Nov 10 2026 1:13 AM

● పోస్టల్‌ సూపరింటెండెంట్‌

జి.జనార్ధన్‌ రెడ్డి

కర్నూలు (అర్బన్‌): మారుతున్న ఈ–కామర్స్‌ రంగం, కొరియర్‌, పార్సిల్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తపాలా శాఖ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కొత్తగా ప్రాంచైజ్‌ 2.0 పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కర్నూలు డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జి.జనార్ధన్‌ రెడ్డి తెలిపారు. అధునాతన ఏపీటీ 2.0 డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించి పారదర్శక సేవలను ప్రజలకు అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేవలం రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌తో సొంతంగా పోస్టల్‌ వ్యాపారం ప్రారంభించుకునేందుకు నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలకు ఈ పథకం అద్భుతమైన అవకాశం కల్పిస్తుందని తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... ఫ్రాంఛైజ్‌ 2.0 గురించి వివరించారు.

ప్రాంచైజ్‌ రకాలు:

బుకింగ్‌ సేవలు: స్పీడ్‌ పోస్ట్‌, సాధారణ పార్సిళ్లు, అంతర్జాతీయ ఈఎంఎస్‌ డాక్యుమెంట్స్‌ బుక్‌ చేయడం.

డెలివరీ సేవలు: ఈ–కామర్స్‌ పార్సిళ్లను కస్టమర్ల ఇళ్లకు చేరవేయడం.

పికప్‌ సేవలు: నేరుగా వ్యాపారులు లేదా ప్రజల వద్ద నుంచే పార్సిళ్లను సేకరించడం.

ఆల్‌ ఇన్‌ వన్‌ సేవలు: బుకింగ్‌, డెలివరీ, పికప్‌ వంటి అన్ని సేవలు ఒకే చోట అందించడం.

అర్హతలు, సెక్యూరిటీ డిపాజిట్‌ :

వయస్సు: కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.

చదువు: బుకింగ్‌ కౌంటర్లకై తే ఇంటర్మీడియట్‌ మరియు డిప్లొమా, కేవలం డెలివరీ సేవలకు 10వ తరగతి పాస్‌ అయి ఉండాలి.

డిపాజిట్‌: డెలివరీ, పికప్‌ సేవలకు రూ.5 వేలు, బుకింగ్‌ సేవలకు రూ.10 వేలు. అన్ని సేవలకు రూ.15 వేలు చెల్లించాలి.

అవసరాలు: ఆపరేట్‌ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌ ఉండాలి. డెలివరీ సేవలకు సొంత టూవీలర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. పోస్టల్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులు.

కమీషన్‌, లావాదేవీలు ఇలా

ప్రతి బుకింగ్‌, పికప్‌, డెలివరీపై కమీషన్‌ లభిస్తుంది. వ్యాపారం పెరిగేకొద్దీ కమీషన్‌ శాతం పెరుగుతుంది. కొత్తగా తీసుకువచ్చిన ఏపీటీ 2.0 మొబైల్‌ యాప్‌, సెల్ఫ్‌ సర్వీస్‌ పోర్టల్‌ ద్వారా బుకింగ్‌లు నిర్వహించవచ్చు. ప్రతి బుకింగ్‌కు సంబంధించిన సమాచారం వెంటనే సిస్టమ్‌లో నమోదవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికై న వారికి శిక్షణ ఇచ్చి, ఒప్పందం కుదుర్చుకున్న 30 రోజులలోపు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ వ్యాపారం, ఇంటర్నేషనల్‌ షిప్‌మెంట్‌లు, పార్సిల్‌ సేవలకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ–కామర్స్‌ విక్రేతలు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు, ఇంట్లోనే ఉండి పని చేసుకునేవారికి ఈ పథకం ఆర్థికంగా చేయూతనిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం కర్నూలు డివిజనల్‌ ఆఫీస్‌ తపాలా కార్యాలయం, సెల్‌ : 94412 63745లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement