కర్నూలు కల్చరల్: కార్తీక మాసంలో అన్నీ రోజులు పర్వదినాలే. ప్రతి ఇంట్లో దీపపు కాంతులతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతాయి. దాదాపుగా నెలంతా పండుగలే అని చెప్పవచ్చు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, భోగేశ్వరాలయం, జగన్నాథథగట్టు రూపాల సంగమేశ్వరాలయం, కాల్వబుగ్గ, సంగమేశ్వరం, రుద్రకోడూరులోని క్షేత్రాల్లో కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతాయి. వీటితో పాటు అహోబిలం, మంత్రాలయం, ఉరుకుందు క్షేత్రాల్లో పూజలు జరుగుతాయి. ముఖ్యంగా శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కర్నూలు నగరంలో నగరేశ్వరస్వామి ఆలయం, సప్తగిరినగర్ కై లాసగిరి ఆలయం, సూర్యనారాయణ స్వామి ఆలయం, అశోక్ నగర్ ప్రసన్నాంజనేయ ద్వారకామాయి ఆలయం, శివరామాలయం, శ్రీరామనగర్ శివాలయం, ఓల్డ్‌సిటీలోని లలితా పీఠం, బుధవారపేట ఈశ్వరాంజనేయస్వామి ఆలయం, మాధవనగర్‌లోని సీతారామాలయం, కొత్తపేటలోని ఈశ్వరాంజనేయ స్వామి ఆలయం తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో కార్తీక మాస పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
కార్తీక మాసంలోని పర్వదినాలు
10న కార్తీక స్నాన ఆరంభం,
బలి పాడ్యమి, ఆకాశ దీప వ్రత ఆరంభం.
11న యమ ద్వితీయ, భగినీ హస్త
భోజనం, చిత్ర గుప్త జయంతి.
12న త్రిలోచన గౌరీ వ్రతం
13న నాగ చతుర్ధి
17న వృశ్చిక సంక్రమణం, గోసాష్టమి
20న ప్రబోధనైకాదశి
21న క్షీరాభ్ది ద్వాదశి, చిల్కు ద్వాదశి,
చాతుర్మాస వ్రతసమాప్తి
23న వైకుంఠ చతుర్ధశి
24న కార్తీక పూర్ణిమ, జ్వాలాతోరణం
27న సంకష్ట హర చతుర్థి
డిసెంబర్ 4న బహుళ ఏకాదశి
6న ధన్వంతరి జయంతి,
యమప్రీతి దీప దానం
7న మాస శివరాత్రి


