బాదం పప్పుపై దీపావళి శోభ | - | Sakshi
Sakshi News home page

బాదం పప్పుపై దీపావళి శోభ

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్‌ బాదంపప్పుపై దీపావళి గురించి సూక్ష్మ చిత్రాలను చిత్రించారు. భయంకర రూపంలో ఉన్న నరకాసుడనే రాక్షసుడిని సత్యభామ సంహరిస్తున్నట్లు, పక్కనే శ్రీకృష్ణుడు ఉన్నట్లు, ఆరు ప్రమిదల దీపాలు ఉన్నట్లు చిత్రాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులకు దీపావళి ముఖ్యమైన పండుగ అని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి లోకకంఠకుడైన నరకాసుడిని వధించారన్నారు. చీకటిని పారదోలుతూ ఇళ్ల ముందు ప్రమిదలతో దీపాలు వెలిగించడమే దీపావళి పండుగ విశేషమన్నారు. – నంద్యాల(అర్బన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement