బైక్‌ను అపహరించి.. దగ్ధం చేసి! | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను అపహరించి.. దగ్ధం చేసి!

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

బనగానపల్లె రూరల్‌: పట్టణంలోని అవుకు రోడ్డులోని రైస్‌మిల్లు సమీపంలో ఉన్న వెంచర్ల లో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి బైక్‌ అపహరించి, దూరంగా తీసుకెళ్లి నిప్పు పెట్టి దగ్ధం చేశారు. రాళ్లకొత్తూరు తండా గ్రామానికి చెందిన అర్జున్‌నాయక్‌ అనే వ్యక్తికి తన బైక్‌ను శుక్రవారం గ్రామంలోని తన ఇంటి ముందు నిలిపాడు. అయితే అర్ధ రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు బైక్‌ ను అపహరించి బనగానపల్లె సమీపంలోని వెంచర్ల వద్ద దగ్ధం చేసినట్లు తెలిపారు. బాధితేడే బనగానపల్లె పోలీసుస్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మోటర్‌ సైకిల్‌ను దగ్ధం చేసిన దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement