గ్రీన్‌ క్రాకర్స్‌ తుస్‌..తుస్‌! | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ క్రాకర్స్‌ తుస్‌..తుస్‌!

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

అధిక లాభాల కోసం గ్రీన్‌ ఫైర్‌ వర్క్స్‌ గుర్తింపు లేని బాణసంచా విక్రయాలు

ఆకాశాన్నంటుతున్న ధరలు.. లబోదిబోమంటున్న వినియోగదారులు

స్టాళ్ల నిర్వహణలో ప్రమాణాలు పాటించని వైనం

కర్నూలు(సెంట్రల్‌): జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు దీపావళి రోజున గ్రీన్‌ క్రాకర్స్‌ను మాత్రమే కాల్చేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయితే వ్యాపారులు ఆ ఆదేశాలను మాత్రం పట్టించుకోవడంలేదు. అధిక లాభాల కోసం పర్యావరణానికి కీడు చేస్తున్న బాణసంచా విక్రయాలే అధికంగా చేస్తున్నారు. వీటి పేలుళ్లతో దుమ్మూధూళి(డస్టు), సల్ఫర్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌లు విడుదలై వాతావారణాన్ని కలుషితం చేస్తాయి. అంతేకాక 100 డెసిబుళ్లకుపైగా శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో గ్రీన్‌ క్రాకర్లను మాత్రమే విక్రయ స్టాళ్లలో ఉంచాలని వ్యాపారులకు ఉన్నతాధికారులు చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వీటిని పట్టించుకోకుండా అధిక లాభాల కోసం వ్యాపారులు సీఎస్‌ఐఆర్‌–నీరీ గ్రీన్‌ ఫైర్‌ వర్‌ుక్స గుర్తింపు, క్యూఆర్‌ కోడ్‌ వివరాలు కనిపించకున్నా విక్రయాలు చేస్తున్రాను. గ్రీన్‌ క్రాకర్స్‌ అమ్మడం లేదనే విషయం స్పష్టమవుతోంది.

ఆకాశన్నంటుతున్న ధరలు

దీపావళి పండుగ రోజున కుటుంబ సభ్యులందరూ ఒకచోటా చేరి బాణసంచా పేలుస్తున్నారు. ప్రజలకు అవసరమైన వాటిని అందుబాటులో ఉంచేందుకు 86 ఏళ్ల నుంచి ప్రభుత్వ పర్యవేక్షణలో క్రాకర్స్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ స్టాళ్లను ఏర్పాటు చేస్తోంది. కర్నూలు, పత్తికొండ, ఆదోనిలలో ప్రజలకు అనువైన చోటా స్టాళ్లను ఏర్పాటు చేసి పరిమితమైన ధరలకు అమ్ముతున్నారు. ఈ ఏడాది కర్నూలులో 100, ఆదోనిలో 15, పత్తికొండలో 4 బాణసంచా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో గతేడాదితో పోల్చుకుంటే ఏకంగా 25 శాతం వరకు రేట్లు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. దీంతో ఒక్కో కుటుంబంపై రూ.3 వేల నుంచి రూ. 5 వేల వరకు అదనపు భారం పడుతోంది. మరోవైపు స్థానిక క్రాకర్స్‌ మర్చంట్‌ ప్రోద్బలంతోనే రేట్లు పెంచి అముతున్నట్లు చెబుతున్నారు. ఈ స్టాళ్లలో షాపు ఏర్పాటు చేసుకోవాలంటే అసోసియేషన్‌కు రూ.20 వేలు, జీఎస్టీ పేరిట రూ.20 వేలు, మునిసిపాలిటీకి రూ.5 వేలు, అదనపు ఖర్చుల కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా డబ్బులతోపాటు పెట్టుబడి, నాలుగు రోజుల నిర్వహణ ఖర్చులు, లాభాల కోసం రేట్లను పెంచి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కాగా.. షాపుల్లో మాత్రం 80–90 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నా వినియోగదారుడికి మాత్రం రేట్లు తగ్గడం లేదు.

వ్యాపారాలు తగ్గాయంటున్న వ్యాపారులు

మరోవైపు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశతో అసోసియేషన్‌కు రూ.46 వేలు కట్టి స్టాల్‌ను ఏర్పాటు చేసిన వ్యాపారాలు జరగడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. కర్నూలుకు సమీపంలోని వెల్దుర్తిలో క్రాకర్స్‌ తయారీ కేంద్రం ఉండడంతో వినియోగదారులతోపాటు వ్యాపారు లు అక్కడికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఫలితంగా ఇక్కడ వ్యాపారాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలో స్టాళ్లు ఏర్పాటు చేసుకున్న వారు కనీసం అసోసియేషన్‌కు చెల్లించినా డబ్బులైనా వస్తాయా లేదా అన్న మీమాంసలో ఉన్నారు.

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు...

కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో దీపావళిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన తాత్కాలిక బాణసంచా విక్రయ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు, లైసెన్సులు, అగ్నిమాపక ఏర్పాట్లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని కౌన్సిల్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ అండ్‌ విజిలెన్స్‌ (సీసీఆర్‌వీ) అధ్యక్షుడు దండు విద్యాసాగర్‌ జిల్లా కలెక్టర్‌కు, ఆర్‌డివో , ఫైర్‌ , పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులకు కు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. మైదానంలో సుమారు 100 దుకాణాలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేశారని, కొన్ని దుకాణాల మధ్య దూరం సుమారు ఒక మీటరు మాత్రమే ఉన్నట్లు ప్రత్యక్ష పరిశీలనలో గుర్తించామని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం దుకాణాల మధ్య తప్పనిసరిగా ఉండాల్సిన మూడు మీటర్ల దూరం, క్లస్టర్ల వారీగా అనుమతులు, ఆమోదిత లేఅవుట్‌ను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. అలాగే అనేక దుకాణాల వద్ద అగ్నిమాపక పరికరాలు కనిపించకపోవడం, విక్రయిస్తున్న ఉత్పత్తులపై సీఎస్‌ఐఆర్‌–నీరీ గ్రీన్‌ ఫైర్‌వర్క్స్‌ గుర్తింపు, క్యూఆర్‌ కోడ్‌ వివరాలు స్పష్టంగా కనిపించకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రతి దుకాణానికి జారీ చేసిన ఎల్‌ఈ–5 లైసెన్సులు, ఇతర అనుమతులు, నిల్వ పరిమితులు, కొనుగోలు బిల్లులు, పాత నిల్వల విక్రయాలు, ముద్రిత గరిష్ట చిల్లర ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నారా అనే అంశాలను కూడా తనిఖీ చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement