టపాసుల విక్రయ కేంద్రానికి తాళం | - | Sakshi
Sakshi News home page

టపాసుల విక్రయ కేంద్రానికి తాళం

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

కోవెలకుంట్ల: స్థానిక మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గుంజలపాడు రహదారి పక్కన బహిరంగ ప్రదేశంలో దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన టపాసుల విక్రయ కేంద్రానికి శనివారం అధికారులు తాళం వేశారు. పట్టణంలో ఎనిమిది విక్రయ కేంద్రాల నిర్వహణకు సంబంధించి ఆన్‌లైన్‌లో చలానా చెల్లించి తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేశారు. తహసీల్దార్‌ పవన్‌కుమార్‌రెడ్డి లైసెన్సుల జారీ నిమిత్తం బనగానపల్లె ఆర్డీఓ కార్యాలయానికి నివేదించారు. ఆర్డీఓ నరేంద్రనాథరెడ్డి అనుమతి పత్రాలు ఇవ్వాల్సి ఉంది. దుకాణ దారులు ఆ పత్రాలు లేకుండానే ఉదయం టపాసుల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌ విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి అనుమతి పత్రాలు చూపించాలని అడుగ్గా ఆర్డీఓ వద్ద నుంచి ఇంకా తీసుకోలేదని నిర్వాహకులు సమాధానమిచ్చారు. అంతేకాకుండా షాపుల మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలనే నిబంధన పాటించకుండా అన్ని దుకాణాలను పక్కపక్కనే ఏర్పాటు చేశారు. లైసెన్స్‌ లేకపోవడం, నిబంధనలు పాటించని కారణంగా తహసీల్దార్‌తో పాటు ఆర్‌ఐ పుల్లయ్య, వీఆర్‌ఓలు ఓబులేసు, రాజశేఖర్‌రెడ్డి, దస్తగిరిబాబులతో కలిసి విక్రయ కేంద్రానికి తాళం వేశారు. అనుమతి ధ్రవపత్రాలతో తహసీల్దార్‌ కా ర్యాలయానికి హాజరై నిబంధనలు పాటించి దుకాణాలు తెరుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టకేలకు ఆర్డీఓ టపాసుల విక్రయ కేంద్రాల నిర్వహణకు రాత పూర్వక అనుమతి ఇవ్వడంతో రాత్రి 7 గంటల నుంచి దుకాణాలు తెరుచుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement