కర్ణాటక మద్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక మద్యం పట్టివేత

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎకై ్స జ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు ఆదేశా ల మేరకు కర్నూలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ జయరాం నాయుడు, ఆదోని ఎకై ్సజ్‌ స్టేషన్‌ సీఐ జాన్‌ సైదులు తమ సిబ్బందితో కలసి కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన పసుల ధర్మన్న ఇంటి వద్ద 6 కార్టన్‌ బాక్సుల్లో నిల్వ ఉంచిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన 576 మద్యం ప్యాకెట్లు (51.84 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినందుకు ధర్మన్నను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సీజ్‌ చేసిన మద్యం విలువ దాదాపు రూ.30 వేలు ఉంటుందని ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు తెలిపారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ రవితేజ, ఆదోని స్టేషన్‌ ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది షేక్‌షావలి, శంకర్‌నాయక్‌, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

కర్నూలు (టౌన్‌) : నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు. శనివారం స్థానిక రాజ్‌విహార్‌, బుధవారపేట, బిర్లా కాంపౌండ్‌, కృష్ణానగర్‌, చెన్నమ్మ సర్కిల్‌ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరాయంగా కొనసాగాలని చెప్పారు. ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement