మహిళా ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగుల నిరసన

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

ఆదోని రూరల్‌: పట్టణంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం వద్ద మహిళా ఉద్యోగులు ఆందోళన చేశారు. ఇక్కడ ఆదోని మండలం–1, ఆదోని మండలం–2, మంత్రాలయం, పెద్దకడబూరు, కోసిగి, కౌతాళం మండలాలకు సంబంధించి శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. విధులకు హాజరైన మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, తాగునీరు, అల్పాహారం, భోజనం వంటి సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యారు. దీంతో మహిళా ఉద్యోగులు ఆర్ట్స్‌ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రంలో నిరసన తెలియజేశారు. దాదాపు గంట పాటు నినాదాలు చేస్తూ ఎన్నికల ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూశారు. మహిళలకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని వాపోయారు. కొంతమంది ఉన్నతాధికారులు, పోలీసులు నచ్చజెప్పడంతో మహిళా ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. కౌంటింగ్‌ యథాతథంగా కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement