బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో పలు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు శనివారం నిర్వహించిన బహిరంగవేలాల ద్వారా ఆలయానికి మొత్తం రూ.18,87,000 ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో పూలదండలు విక్రయించుకునే హక్కు ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన పుల్లయ్య రూ.6.72 లక్షలు, బొమ్మలు అమ్ముకునే హక్కును చెరువుపల్లె గ్రామానికి చెందిన అనసూయ రూ.7 లక్షలు, అమ్మవారి ఫొటోలు, స్కిక్కర్లు, దారా లు, ఉంగారాలు అమ్ముకునే హక్కును నందవరం గ్రా మానికి చెందిన బి సుధాకర్‌రెడ్డి రూ.5.15 లక్షలు అత్యధిక బహిరంగవేలం పాడి దక్కించుకున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆలయ పర్యవేక్షణాధికారి బ్రహ్మనందరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


