ఓర్వకల్లు: గ్రామీణ ప్రాంతాలలో వైద్య ఆరోగ్యసేవలను విస్తృతం చేయాలని ఎన్‌ఆర్‌ఎల్ మిషన్ బృందం సభ్యులు డాక్టర్ నరసింహులు నాయక్ అన్నారు. రాష్ట్ర ఆరోగ్య రివ్యూ మిషన్ సభ్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎన్‌పీసీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నరసింహ నాయక్, రాష్ట్ర కన్సల్టెంట్ రామచంద్రుడు శుక్రవారం హుసేనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను నిశితంగా పరిశీలించారు. ప్రధా నంగా ఓపీ రిజిష్టర్లు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు, వివరాలు, చిన్నారుల వాక్సినేషన్ మందుల పంపిణీ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశా రు. అనంతరం వారు రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. స్థానిక వైద్యాధికారులు హెల్త్ వర్కర్లతో సమావేశమై విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆసుపత్రికి కావాల్సిన అదనపు మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, డీపీఎంఓ హేమలత, స్థానిక వైద్యాధకారి డాక్టర్ రేఖా, ఆయుష్ వైద్యులు డాక్టర్ ప్రసాద్, ఆరోగ్య విస్తరణ అధికారి రాబర్టు తదితరులు ఉన్నారు.


