రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Nov 6 2026 1:50 AM | Updated on Nov 6 2026 1:50 AM

అనారోగ్యంతో కానిస్టేబుల్‌ మృతి ఎమ్మిగనూరురూరల్‌: అనారోగ్యంతో ఎమ్మిగనూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్లో విధులు నిర్వహించే సి. రఘు (44) గురువారం తెల్లవారుజామున మృతి చెందా డు. నందవరం గ్రామా నికి చెందిన ఈయనకు వారం రోజుల క్రితం కడుపునొప్పి రావటంతో కర్నూలులోని మెడికవర్‌ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషవ ుంగా ఉండటంతో హైదరాబాద్‌లోనిఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. పోలీస్‌ లాంఛనాలతో నందవరంలో శుక్రవారం అంత్యక్రియలు చేయనున్నారు. కానిస్టేబుల్‌ సి. రఘుకు భార్య హేమలత, కుమారుడు సాయిప్రణీత్‌ (ఇంటర్‌), కుమార్తె తేజస్విని(10వ తరగతి) ఉన్నారు.

తుగ్గలి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. తుగ్గలి ఎస్‌ఐ బాలనరసింహులు తెలిపిన వివరాల మేరకు.. మద్దికెర మండలం పెరవలికి చెందిన కొత్తగొల్ల సుంకన్న (38) ఆదోనిలో బండలు పరిచే పనికి వెళ్లి బైక్‌పై వెళ్లాడు. స్వగ్రామానికి తిరిగి వస్తూ రాతన ఆశ్రమ పాఠశాల సమీపంలో గుత్తి నుంచి పత్తికొండ వైపు వెళుతున్న జీపును ఢీకొట్టాడు. ప్రమాదంలో సుంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఓటేసి వెళ్తూ..

వలస కూలీ దుర్మరణం

తుగ్గలి: ఓటువేసిన అనంతరం పనికి వెళ్లి ఇంటి వస్తూ పోల్‌ పడటంతో వలస కూలీ ఈడిగి భాస్కరగౌడ్‌ మృతి చెందాడు. ఈ దుర్ఘటన గుత్తి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. చెన్నంపల్లికి చెందిన ఈడిగి భాస్కరగౌడ్‌(42) తన భార్య శివలక్ష్మి, నలుగురు కుమార్తెలతో కలిసి బతుకుదెరువు నిమిత్తం పది రోజుల క్రితం తెలంగాణకు వలస వెళ్లారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు బుధవారం సొంతూరికి వచ్చాడు. ఓటువేసిన అనంతరం పని నిమిత్తం అదే గ్రామానికి చెందిన కలచట్ల వెంకన్నతో కలిసి బైక్‌పై గుత్తికి వెళ్లాడు. అక్కడి పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా గుత్తి ఆర్‌ఎస్‌ చర్చి సమీపంలో కర్ణాటకకు చెందిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. రోడ్డు మధ్యలో ఉన్న పోల్‌ మోటారు సైకిల్‌పై పడి భాస్కర్‌గౌడ్‌ అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన వెంకన్నను ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురానికి తరలించారు.

ఉరుకుంద ఆలయానికి రూ.లక్ష విరాళం

కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రూ.1,00,116 నగదును జోగులాంబ గద్వాల జిల్లా సుల్తానాపురం గ్రామానికి చెందిన మహదేవగౌడ్‌ కుటుంబ సభ్యులు గురువారం అందజేశారు. దాతలకు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలను చేయించారు. స్వామి వారి తీర్థప్రసాదాలను, బాండును అందజేశారు. ఆలయ అభివృద్ధికి భక్తులు విరివిగా విరాళాలు అందజేయాలని డిప్యూటీ కమిషనర్‌ వాణి కోరారు. కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకుడు శివకుమార్‌, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

కుక్కల దాడిలో

గొర్రె పిల్లలు మృతి

ెపద్దకడబూరు : కుక్కల దాడిలో దాదాపు 40 గొర్రె పిల్లలకు పైగా మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. గ్రామ సమీపంలో ఉన్న కురువ బీరప్ప పొలంలో దొడ్డి వేసి గొర్రెలను ఆపుతున్నారు. యథావిధిగా గురువారం రోజున ఉదయం గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. అయితే 150కి పైగా ఉన్న గొర్రె పిల్లలను అక్కడే దొడ్డిలో నిలిపి వాటి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా వాటికి కాపలా ఉన్న వారు ఓటు వేసేందుకు గ్రామంలోకి వెళ్లారు. మధ్యాహ్నం ఎవ్వరూ లేని సమయంలో కుక్కలు దాడి చేయడంతో 20కి పైగా గొర్రెపిల్లలు మృతిచెందగా మరో 20కి పైగా గొర్రె పిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో రూ. 2లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు కంబగిరి గోపాల్‌, మల్లయ్య, ఓంకార్‌ తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement