వైఎస్సార్‌సీపీ నాయకుల అక్రమ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుల అక్రమ అరెస్ట్‌

Nov 6 2026 1:50 AM | Updated on Nov 6 2026 1:50 AM

ఈఓకు వేతనం నిలిపివేతపై విచారణ జరపాలి

నందికొట్కూరు: ప్రసాజ్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే గెలవలేమనే అక్కసుతో టీడీపీ గూండాలు దౌర్జన్యాలు, అక్రమాలకు, దాడులకు పాల్పడ్డారు. నందికొట్కూరు, మిడుతూరు, పాములపాడు వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని రూరల్‌ పోలీసు సర్కిల్‌ కార్యాలయానికి తరలించారు. నందికొట్కూరు మండలంలో ఓంకారీశ్వర్‌రెడ్డి, శంకరయ్య, శ్రీను, ఆంజనేయులు, అల్లిబాషా, బాబులాల్‌, దుబాయిబాషా, నాగార్జున, మురళి, నాగరాజు, మిడుతూరు మండలంలో శివరామకృష్ణారెడ్డి, తులసిరెడ్డి, మల్లేశ్వరరెరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శివనాగిరెడ్డి, కిషోర్‌కుమార్‌రెడ్డి, ఎల్లారెడ్డి, గోపు చంద్రశేఖర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, శివ, రాముడు,జూపాడుబంగ్లా మండలంలో నక్క మల్లయ్య, నరేష్‌రెడ్డి, మండ్లెం రమణ, తిరుమలేష్‌రెడ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేసి బలవంతంగా వాహనాల్లో తీసుకెళ్లారు. సాయంత్రం వరకు వారిని స్టేషన్‌లో కూర్చొబెట్టి తర్వాత వదిలేశారు.

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావుకు రెండు సంవత్సరాలుగా జీతం రాకపోవడంపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని అఖిల భారత హిందూ మహాసభ పార్టీ ఏపీ అధ్యక్షుడు గూండ్ల మల్లికార్జున డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావుకు గత 21 నెలలుగా జీతం రాకపోవడం పలు సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారురు. అలాగే ఈఓ డీడీఏగా ఉండి దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్‌కు జీతాలు డ్రా చేయాలని, అయితే నిబంధనలకు విరుద్ధంగా డీఈఓ డీడీఓగా ఉండడం ఏంటని ప్రశ్నించారు. ఇందుకు అనుమతులు ఎవరు ఇచ్చారని, డీడీఓ అధికారాలు మరొకరికి బదిలీ చేసేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఆయా అధికారాలు ఇవ్వడానికి గల కారణాలు ఎంటో ఉన్నతాధికారులు తెలపాలని డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం, దేవదాయశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే స్పందించి ఈ వ్యవహారంపై స్వతంత్ర ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement