వైఎస్సార్‌సీపీ నాయకుల గృహ నిర్బంధం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుల గృహ నిర్బంధం

Nov 6 2026 1:50 AM | Updated on Nov 6 2026 1:50 AM

గోస్పాడు: స్థానిక ఎన్నికల పోలింగ్‌ రోజున వైఎస్సార్‌సీపీ నాయకులు బయటకు రాకుండా పోలీసుల అండతో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీబగుంట్లలో రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ సీఈసీ మెంబర్‌ పీపీ నాగిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు మధుసూదన్‌రెడ్డిని వారి స్వగృహల్లో నిర్బంధించారు. అలాగే రాయపాడుకు చెందిన యాసం రామసుబ్బారెడ్డి, జిల్లెల్లకు చెందిన కృష్ణారెడ్డి, ఆయన తనయుడు నారాయణరెడ్డిలను గోస్పాడు స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. పరిషత్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైఎస్సార్‌సీపీ నాయకులు బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంపై పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను నిబంధనల పేరుతో హౌస్‌ అరెస్ట్‌ చేయడం తగదన్నారు. ఈ నిబంధన అధికార పార్టీ నాయకులకు వర్తించేలా చూడాలన్నారు. ప్రతిపక్ష నాయకులను ఇళ్లకు పరిమితం చేసి అధికార పార్టీ నాయకులు పోలింగ్‌ కేంద్రాల వద్ద తిరగడం పద్ధతి కాదన్నారు. టీడీపీ నాయకులు రిగ్గింగ్‌, దౌర్జన్యాలను చేసుకొనేందుకే తమను గృహ నిర్బంధం చేశారన్నారు. ఓటుతో వారికి ప్రజలే తగిన విధంగా సమాధానం చెబుతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement