మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని మహిళల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని మహిళల ఆందోళన

Nov 6 2026 1:50 AM | Updated on Nov 6 2026 1:50 AM

బేతంచెర్ల: ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామంలోని పాఠశాలకు వెళ్లే రహదారిలో మద్యం దుకాణం ఏర్పాటును మహిళలు, గ్రామస్తులు గురువారం వ్యతిరేకించారు. ప్రజలు, విద్యార్థులు తిరిగే రహదారిలో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. గతంలో మండలంలోని సీతారామాపురం గ్రామంలో మద్యం దుకాణం ఉండగా అక్కడ వ్యాపారం సరిగా లేకపోవడంతో ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామంలో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణానికి ఎదురుగా పొలంలో మరో మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అందుకు అవసరమైన సామగ్రిని వాహనంలో తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని మహిళలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఇప్పుడే ఒక మద్యం దుకాణం ఉందని అదనంగా మరో మద్య దుకాణం వద్దని గ్రామంలోని మహిళ లు భీష్మించారు. ఈ విషయంపై ఎక్స్‌జ్‌ సీఐ జఫ్రుల్లాను వివరణ కోరగా.. మండలంలో ఎక్కడైనా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. రూల్‌ 24 ప్రకారం జాతీయ రహదారికి 220 మీటర్లు, గుడి, బడి, చర్చికి 100 మీటర్లు దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అనుమతి ఇవ్వమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement