‘విష సంస్కృతికి తెరలేపిన కూటమి’ | - | Sakshi
Sakshi News home page

‘విష సంస్కృతికి తెరలేపిన కూటమి’

Nov 6 2026 1:50 AM | Updated on Nov 6 2026 1:50 AM

● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

పగిడ్యాల: అధికార కూటమి ప్రభుత్వం నీచమైన చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు. ఆయన గురువారం ముచ్చుమర్రిలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నాయకులను ఊరూరా అక్రమ అరెస్ట్‌లు చేసి స్టేషన్లలో పెట్టారని ధ్వజమెత్తారు. నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటర్లు పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అక్రమ అరెస్ట్‌లు చేయించిందని విమర్శించారు. నామినేషన్లు వేసి ప్రచారాలు మాత్రమే తమ అభ్యర్థులు చేశారని టీడీపీ నేతల్లాగా మందు, డబ్బులు పంపిణీ చేయలేదని అయినా తమ నాయకులు, కార్యకర్తలు, పోలింగ్‌ ఏజెంట్లపై బెదిరింపులకు పాల్పడుతుండడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే దానికంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను కూడా నామినేటెడ్‌ విధానంలో ఇచ్చుకుంటే ఏ బాధ ఉండేది కాదని నిప్పులు చెరి గారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు, అక్రమ అరెస్ట్‌ లు చేసినా ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి ఆదరణ తగ్గలేదన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లు వేయలేని పరిస్థితి కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నామని భవిష్యత్‌లో కూటమి చర్యలు ఏ పరిణామాలకు దారి తీస్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement