కర్నూలు(సెంట్రల్): బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్ల్లో భాగంగా చిరుధాన్యాల వినియోగం అలవాటు చేసుకోవాలని ఏపీ పీసీబీ ప్రాంతీయాధికారి పీవీ కిశోర్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. బుధవారం పీసీబీ ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ప్రధాన పరిశ్రమల్లోని కార్మికులకు హెల్త్ కేర్ ఫెసిలిటీస్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పిల్లల్లో సుస్థిర జీవనశైలి పెంపొందించడానికి కర్నూలులోని ప్రభుత్వ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ – ఆనంద–నిలయం (అనాథ) హాస్టల్ విద్యార్థులకు బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవం – సుస్థిర ఆహార వ్యవస్థలను అలవరచుకోండి‘ అనే అంశంపై బొమ్మలు గీయడం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని, పర్యావరణం కోసం జీవనశైలిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ, చిరుధాన్యాల భోజనం వినియోగ కార్యక్రమాలను నిర్వహించారు.


