ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

● సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ● పలు పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

● సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ● పలు పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లావ్యాప్తంగా గురువారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకున్న బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కోడుమూరు, గోనెగండ్ల మండలం కుర్నూరు, కప్పట్రాళ్ల, హోసూరు, ఆస్పరి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద చేపట్టిన భద్రత ఏర్పాట్లు, బందోబస్తును పరిశీలించి అక్కడ విధుల్లో ఉన్న అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా జరిగే విధంగా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. విధుల్లో ఎవరూ నిర్లక్ష్యం, అలసత్వం వహించకుండా సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు. కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు మధుసూదన్‌ రావు, తబ్రేజ్‌, శేషయ్య, ధనుంజయ, మన్సూరుద్దీన్‌, నాగరాజరావు, కోడుమూరు ఎస్‌ఐ బీవై స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement