● 1.5 కిలోల గంజాయి,
రెండు వాహనాలు స్వాధీనం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగర శివారులోని మునగాలపాడు బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న ఈడిగ శ్రీనివాసులు గౌడ్ అనే వ్యక్తిని ఎకై ్సజ్ అధికారులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో నిందితుడి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని, గంజాయి విక్రయాలకు ఉపయోగిస్తున్న ఒక యాక్టివా (నంబర్ లేని) ద్విచక్ర వాహనం, ఒక మహీంద్ర బొలెరో (ఏపీ 21 బీజీ 6966) వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీనివాసులు గౌడ్ టీచర్స్ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. ఇతను కొంతకాలంగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారంతో నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. సదరు నిందితుడు గతేడాది సెప్టెంబర్‌లో 420 గ్రాముల గంజాయితో పట్టుబడి రిమాండ్‌కు తరలించబడ్డాడని, అనంతరం బయటకు వచ్చిన తర్వాత కూడా గంజాయి విక్రయాలు కొనసాగిస్తూ రెండోసారి పట్టుబడ్డాడని తెలిపారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్, ఎస్ఐలు నవీన్‌కుమార్, రెహనా, ట్రైనీ ఎస్ఐలు హరికృష్ణ, శృతి, మౌనిక, హెడ్ కానిస్టేబుల్ నరసింహులు, కానిస్టేబుళ్లు రామచంద్ర, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


