క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతం | - | Sakshi
Sakshi News home page

క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతం

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్యులు ఒకే వేదికపై రెండు క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి రోగుల ప్రాణాలు కాపాడారు. రోడ్డు ప్రమాదంలో ప్లీహానికి తీవ్రగాయమైన గూడూరుకు చెందిన మాసూంమియ్య (32)కు కోత లేకుండా ల్యాపరోస్కోపిక్‌ స్ల్పీనెక్టమి గత నెల 1న విజయవంతంగా చేశారు. అలాగే ఆదోనికి చెందిన ఇక్బాల్‌బాషా (52)కు డయాఫ్రాగ్మాటిక్‌ హెర్నియా (ఊపిరితిత్తుల కింద కండ మెత్తబడటం) సమస్యకు ఆధునిక థొరకోస్కోపిక్‌ విధానంలో శస్త్రచికిత్స గత నెల 15న నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలను జనరల్‌ సర్జరీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామకృష్ణనాయక్‌ ఆధ్వర్యంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సబీరా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ ప్రణీత్‌, డాక్టర్‌ ప్రశాంతి, పీజీ వైద్యులు డాక్టర్‌ మనోజ్‌, డాక్టర్‌ తేజ, డాక్టర్‌ అంచల్‌, డాక్టర్‌ సోమశేఖర్‌ నిర్వహించారు. రెండు వారాల అనంతరం వారు ఆరోగ్యంగా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. తాజాగా రోగులిద్దరూ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి రావడంతో మళ్లీ పరీక్షించి ఎలాంటి సమస్యా లేదని నిర్దారించుకున్నారు. వైద్యులను బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, హెచ్‌ఓడీ డాక్టర్‌ హరిచరణ్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement