నేడే పరిషత్‌ ‘పోరు’ | - | Sakshi
Sakshi News home page

నేడే పరిషత్‌ ‘పోరు’

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

పోలింగ్‌కు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

జెడ్పీటీసీ స్థానాల్లో 97, ఎంపీటీసీ స్థానాల్లో 907 మంది అభ్యర్థుల పోటీ

648 లోకేషన్లలో 1,432 పోలింగ్‌ కేంద్రాలు

697 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌, 735 కేంద్రాల్లో వీడియోగ్రఫీ

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు 255 మంది మైక్రో అబ్జర్వర్స్‌

బ్యాలెట్‌ పేపర్లు తీసుకుంటున్న పోలింగ్‌ సిబ్బంది

జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. అన్ని మండల కేంద్రాలకు సకాలంలో అవసరమైన ఎన్నికల సామగ్రిని చేరవేశాం. ఆయా మండల కేంద్రాల నుంచి కూడా గ్రామాలకు చేర్చే ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాం. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు, ఓటర్లకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయించాం. సజావుగా ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నాం.

– ఆర్‌.సుధాకర్‌రెడ్డి, స్థానిక సంస్థల

ఎన్నికల అధికారి/జెడ్పీ సీఈఓ

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎంపికకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 26 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీల నుంచి 97 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జిల్లాలోని వెల్దుర్తి మినహా మిగిలిన 25 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. 26 మండలాల్లోని మొత్తం 432 ఎంపీటీసీ స్థానాలకు గాను 74 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 358 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాలకు మొత్తం 907 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అధికార కూటమి పార్టీలకు చెందిన అభ్యర్థులకు ధీటుగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ధైర్యంగా ఎన్నికల బరిలో నిలిచారు.

1,432 కేంద్రాల్లో పోలింగ్‌

జిల్లాలోని 26 మండలాలకు చెందిన 648 లోకేషన్లలో 1,432 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందు లో అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా 299, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా 398, సాధారణ పోలింగ్‌ కేంద్రాలుగా 735ను గుర్తించారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా అవసరమైన మేర రక్షణ, భద్రత ఏర్పాట్లు కూడా చేపట్టారు. అలాగే అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని పర్యవేక్షించేందుకు 255 మంది సూక్ష్మ పరిశీలకులను ( మైక్రో అబ్జర్వర్లు ) నియమించారు. ఈ నేపథ్యంలోనే 697 అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక కేంద్రాల్లో జరిగే ఓటింగ్‌ను వెబ్‌క్యాస్టింగ్‌ చేయనున్నారు. అలాగే 735 సాధారణ పోలింగ్‌ కేంద్రాల్లో జరిగే ఓటింగ్‌ను వీడియోగ్రఫీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణను పరిశీలించేందుకు 52 ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలు, 52 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు.

ఎన్నికల విధుల్లో 8,681 మంది ఉద్యోగులు

ఈ నెల 5వ తేదిన జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కు సంబంధించి వివిధ కేడర్లలో మొత్తం 8,681 మంది అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పా ల్గొంటున్నారు. జిల్లాలోని 26 మండలాల్లో ఈ ఎన్నికలు జ రుగుతున్నాయి.మొత్తం 1432 పోలింగ్‌ కేంద్రాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో 1575 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1578 మంది ఏపీఓలు, 5128 మంది ఓపీఓలు, రిజర్వులో 100 మంది విధులు నిర్వహించనున్నారు.

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూరి్త

కర్నూలు(సెంట్రల్‌): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్‌/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ఏ.సిరి తెలిపారు. బుధవారం ఆమె కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ ఓటర్‌ స్లిప్‌ ఉన్నా, లేకపోయినా 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఈనెల 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 648 ప్రాంతాల్లో మొత్తం 1,432 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో జరిగే కౌంటింగ్‌ ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు.

జిల్లాలో ఓటర్ల వివరాలు ...

మండలాల వారీగా ఏకగ్రీవమైన ఎంపీటీసీలు

కోసిగి 20, వెల్దుర్తి 15, క్రిష్ణగిరి 12, పత్తికొండ 06, హాలహర్వి 04, మంత్రాలయం 03, ఆలూరు 03, హోళగుంద 03, కర్నూలు రూరల్‌ 05, కౌతాళం 02, చిప్పగిరి మండలంలో 01 ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమయ్యాయి.

26 జెడ్పీటీసీ, 358 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌

గ్రామాలకు తరలిన ఎన్నికల సామాగ్రి

జిల్లా పరిషత్‌ నుంచి జిల్లా మండల కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి బుదవారం ఉదయం నుంచి ఆయా మండల కేంద్రాల నుంచి ప్రిసైడింగ్‌ అఫీ సర్లు,ఆర్‌ఓ, ఎంపీడీఓల పర్యవేక్షణలో గ్రామాలకు చేరింది.ప్రత్యేకంగా ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించిన ఆర్‌టీసీ బస్సులు,ఇతర వాహనా ల్లో బ్యాలెట్‌ బాక్సులు,బ్యాలెట్‌ పేపర్ల ట్రంకు పె ట్టెలు, ఇతరత్రా స్టేషనరీని ఆయా కేంద్రాల్లో ఎన్ని కల విధులు నిర్వహించనున్న ఉద్యోగులు తీసుకు వెళ్లారు.పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 29 స్ట్రాంగ్‌ రూమ్స్‌లో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరచనున్నారు.

పోలింగ్‌ సామగ్రిని తీసుకుంటూ..

బ్యాలెట్‌ బాక్స్‌ను తీసుకెళ్తూ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement