ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా
కర్నూలు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. సుమారు 2,155 మంది వివిధ హోదాల్లోని పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. జిల్లాలో 24 ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాలపై ప్రత్యేక నిఘా కోసం అదనపు సాయుధ బలగాలను మోహరించారు. అలాగే 94 అత్యంత సమస్యాత్మక, 162 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టారు. మొబైల్ నిఘా బృందాలు సైతం ఏర్పాటయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు. ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ఇందులో భాగంగా సెక్షన్ 144 పోలీస్ యాక్ట్, సెక్షన్ 30ని అమలు చేస్తున్నారు.
సోషల్ మీడియాపై నిఘా
వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమా ల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, తప్పుడు ప్రచారం చేసినా, పుకార్లు వ్యాప్తి చేసినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అనుమతి లేని వాహనాల్లో తిరిగితే చట్టపరమైన చర్యలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.
బందోస్తుకు వెళ్తున్న పోలీసులు


