పోలీసుల తీరుపై న్యాయ పోరాటం | - | Sakshi
Sakshi News home page

పోలీసుల తీరుపై న్యాయ పోరాటం

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

పత్తికొండ: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన రోజు నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారని, వారి తీరుపై న్యాయ పోరాటం చేస్తామని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. కృష్ణగిరి మండలంలో సీఐ యుగంధర్‌, హనుమంతరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కృష్ణగిరి మండలంలో టీడీపీ తరఫున జెడ్పీ టీసీ అభ్యర్థి లేడని, ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటు వేస్తారని కారణంతో 70 మంది నాయకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారన్నారు. వైఎస్సార్‌సీపీకి ఏజెంట్లుగా కూర్చోవద్దని హెచ్చరికలు జారీ చేశారన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఇలాంటి చర్యలకు తీసుకోవాలి తప్ప అప్రజాస్వామ్యకంగా పోలీసులు వ్యవహరిచడం తగదన్నారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికల ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అలాంటిప్పుడు ప్రజాతీర్పును పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీలను నామినేట్‌డ్‌గా మార్చుకోవాలని సూచించారు. నామినేషన్లు సమయంలో తనను అక్రమంగా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారన్నారు. తమ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేసిన పోలీసులపై వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయ పోరాటం చేసి శిక్షిస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీరంగడు, సోమశేఖర్‌, నారాయణ్‌దాస్‌, గాంధీరెడ్డి, భాస్కర్‌నాయక్‌, రంగానాయక్‌, మహమ్మద్‌, సాబ్డిన్‌ నూర్‌భాషా, బబ్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement