నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ విజయం రాష్ట్రమంతా చూసింది | - | Sakshi
Sakshi News home page

నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ విజయం రాష్ట్రమంతా చూసింది

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

నందికొట్కూరు: మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ కుర్చీ వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకోవడంతో రాష్ట్రమంతా నందికొట్కూరు వైపు చూసిందని పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నా రు. బుధవారం పట్టణంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలను ఆదుకోవడంలో, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా వచ్చి వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశారన్నారు. ఓట్లేసి వైఎస్సార్‌సీపీ గెలిపించిన నందికొట్కూరు పట్టణ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన అభ్యర్థులు వార్డుల అభివృద్ధికి కృషిచేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ దార సుధీర్‌ సూచించారు. చైర్‌పర్సన్‌ షేక్‌ ఫాతిమాబీకి సహకారం అందించాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సాఫీగా జరగకుండా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి టీడీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకోవడం సిగ్గు చేటన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ మన్సూర్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement