59 ఓట్లతో గెలిస్తే ఓడినట్లు ప్రకటించారు | - | Sakshi
Sakshi News home page

59 ఓట్లతో గెలిస్తే ఓడినట్లు ప్రకటించారు

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

● తిరస్కరించిన ఓట్లను టీడీపీ అభ్యర్థికి కలిపించిన మంత్రి టీజీ భరత్‌

● తిరస్కరించిన ఓట్లను టీడీపీ అభ్యర్థికి కలిపించిన మంత్రి టీజీ భరత్‌

కర్నూలు(సెంట్రల్‌): నేను 59 ఓట్లతో గెలుపు సాధించినా మంత్రి టీజీ భరత్‌ ప్రోద్బలంతోనే ఓడినట్టు కర్నూలు కమిషనర్‌ ప్రకటించారని వైఎస్సార్‌సీపీ 23వ వార్డు అభ్యర్థి ఎస్‌.వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం ఆయన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23వ వార్డుకు సంబంధించి 6వ రౌండ్‌ వరకు తనకు 2,336 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 2,278 ఓట్లు పడ్డాయని, 59 ఓట్లతో గెలుపొందినట్లు ఆర్‌ఓ డిక్లరేషన్‌ ఫారమ్‌ రాస్తుండగా మంత్రి టీజీ భరత్‌గుప్తా ఆదేశాలతో మునిసిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు కలుగజేసుకొని అడ్డుకున్నారన్నారు. ఆయన స్వయంగా చెల్లని ఓట్లను టీడీపీ అభ్యర్థి ఖాతాలో వేసి ఆయన 35 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించారన్నారు. ఇది చాలా అన్యాయమని, గెలిచినా తనను ఓడినట్లు అధికారులు ప్రకటించడం దారుణమన్నారు. తనకు న్యాయం జరగకపోతే టీజీ భరత్‌ గుప్తానే తన చావుకు కారణమవుతారని, ఆయన ఇంటి ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరిని కలిసి తన ఆవేదనను విపించగా ఆమె కోర్టుకు వెళ్లమని చెప్పినట్లు వివరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు షరీఫ్‌, యాట ఓబులేసు, మాల సంఘం జిల్లా అధ్యక్షుడు మాధ్వస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement