కర్నూలు(సెంట్రల్): కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి అథెనా స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిబంధనలు మేరకు కౌంటింగ్‌ను చేపట్టాలని ఆదేశించారు.
పోలీసుల నిషేధాజ్ఞలు బేఖాతర్
కర్నూలు: పుర పోరులో చివరి అంకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య సాగింది. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసు నిషేధాజ్ఞలను బేఖాతర్ చేశారు. ఆయా కేంద్రాల వద్ద బాణసంచా కాలుస్తూ గుంపులుగా చేరి కొన్నిచోట్ల కవ్వింపు చర్యలకు పాల్పడినా పోలీసులు మిన్నకుండిపోయారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ వేడుకలకు అనుమతి లేదని జిల్లా పోలీసు బాస్ స్పష్టంగా ప్రకటించినప్పటికీ అధికార పార్టీ నాయకులు సంబరాల్లో మునిగి తేలారు.


