ఐడీబీఐ బ్యాంకును విదేశానికి అమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

ఐడీబీఐ బ్యాంకును విదేశానికి అమ్మొద్దు

Nov 3 2026 1:45 AM | Updated on Nov 3 2026 1:45 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): ఐడీబీఐ బ్యాంకును పరాయి దేశానికి అమ్మవద్దని ఆ బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఐడీబీఐ బ్యాంకును కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ కంపెనీకి విక్రయించడాన్ని నిరసిస్తూ సోమవారం భోజన విరామ సమయంలో కర్నూలులోని ఐడీబీఐ బ్యాంకు ఎదుట ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కెనడా దేశానికి చెందిన సంస్థకు బ్యాంకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ వాటాలో నుంచి 30.48 శాతం, ఎల్‌ఐసీ వాటాలో 30.24 శాతం విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోపు పూర్తవుతుందని కేంద్రం చెప్పడం ఏకపక్ష చర్యగా ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీసేదిగా ఉన్న ఈ ప్రతిపాదనలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. బ్యాంకింగ్‌ చరిత్రలోనే ఒక బ్యాంకును విదేశీ పెట్టుబడిదారులకు అమ్మడం ఇదే మొదటిసారని, ఇది అత్యంత దారుణమైన విషయమన్నారు. బ్యాంకు ఉద్యోగ సంఘాలు మేల్కోకపోతే మరిన్ని బ్యాంకులను అమ్మేసే ప్రమాదం ఉందన్నారు. ఈ చర్యల వల్ల బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సంపదకు భద్రత ఉండదని వివరించారు. కార్యక్రమంలో ఐసీఈయూ నాయకు లు సురేష్‌, రమేష్‌, ఉస్మాన్‌బాషా, నీలిమ, వసంత, సేవ్‌ పబ్లిక్‌ సెక్టారు నాయకులు ప్రసాద్‌శర్మ, రఘుబాబు, గ్రామీణ బ్యాంకుల నుంచి జగదీశ్వరరెడ్డి, హనుమంతురెడ్డి, పట్టణ పౌరసేవా సంఘం నాయుకుడు పుల్లారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement