పెట్టుబడి నేలపాలు | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి నేలపాలు

Nov 3 2026 1:45 AM | Updated on Nov 3 2026 1:45 AM

ఖరీఫ్‌లో నష్టపోయిన రైతును రబీలోనూ వరుణుడు కరుణించ లేదు. మినుము, మొక్క జొన్న పంటలు సాగు చేసిన రైతుల ఆశలు మొలకెత్తలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా విత్తు సరిగా మొలవక పోవడం, ఎండ తీవ్రతకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో చేసేదిలేక మండల పరిధిలోని తిప్పారెడ్డిపల్లె, ఆర్‌.కొత్తూరు, బీ.నాగిరెడ్డిపల్లె, పేరూరు తదితర గ్రామాల పరిధిలో మొక్కజొన్న పైరును ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఎన్నో ఆశలతో పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసి చివరకు చేతికి చిల్లి గవ్వకూడా అందకుండానే పైరును దున్నేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని తిస్పారెడ్డిపల్లె రైతు తులసిరెడి ఆవేదన వ్యక్తం చేశాడు. – రుద్రవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement