నందికొట్కూరు: మండలంలోని బిజినవేముల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాబులాల్, మహేష్, బాలకృష్ణ, బుడ్డన్న, పులెంద్ర, అఖిల్, బాషా, ఫైల్‌మాన్, ఇలియాస్, శేఖర్ తదితరులు వైఎస్సార్‌సీపీ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు. వీరితో పాటు 100 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వ లక్షణాలు, వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేతులు ఎత్తేసిన సీఎం చంద్రబాబుకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. పేద కుటుంబాల బాగుకోసం ఆలోచించే గొప్ప నాయకులు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచు సవారయ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు అలీబాషా, అబుబక్కర్, మన్సూర్‌బాషా, నూర్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.


