కరువు రైతుల కన్నీరుమున్నీరు | - | Sakshi
Sakshi News home page

కరువు రైతుల కన్నీరుమున్నీరు

Nov 3 2026 1:45 AM | Updated on Nov 3 2026 1:45 AM

● జిల్లాలో పర్యటించిన

కేంద్ర కరువు బృందం

కర్నూలు(అగ్రికల్చర్‌): వర్షాభావ పరిస్థితులతో ఉత్పన్నమైన కరువు పరిస్థితులను చూసి ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ ప్రతినిధులు తీవ్రంగా చలించిపోయారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చిన సెంట్రల్‌ టీమ్‌ అనంతపురం జిల్లా పర్యటనను ముగించుకొని సోమవారం మధ్యాహ్నం 12.50 గంటలకు తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామం చేరుకుంది. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర, పత్తికొండ మండలాల్లో కేంద్రబృందం పర్యటించింది. ఖరీఫ్‌ సీజన్‌లో వివిధ పంటలు సాగు చేసి సర్వం కోల్పోయిన రైతులు సెంట్రల్‌ టీమ్‌ ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. చుక్కనీరు లేని చెరువులను, ఎండిపోయిన పంటలను, ఇతర కరువు పరిస్థితులను ఐదుగురు సభ్యులు కలిగిన సెంట్రల్‌ టీమ్‌ ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. కేంద ప్రభుత్వ డీవోడీ డైరెక్టర్‌ కే. పొన్నుసామి నేతృత్వంలో నీతి ఆయోగ్‌ సీనియర్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ బి.అనురాధ, ఎన్‌పీఎంయు–పీహెచ్‌ఈ ఆర్‌ఐసీ ధీరేంద్రకుమార్‌, కేంద్ర ఫుడ్‌ అండ్‌ పీడీ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌, కేంద్ర పశుసంవర్ధక శాఖ అధికారి సాక్షి బౌదరియా కరువు పరిస్థితులను పరిశీలించారు. ఎర్రగుడి గ్రామంలో కరువుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ తిలకించారు. పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులతో ముఖాముఖి మాట్లాడి కరువు తీవ్రతను తెలుసుకున్నారు. మద్దికెర మండలం పెరవలిలో సెంట్రల్‌ టీమ్‌ సజ్జ, పత్తి పంటలతో పాటు ఉద్యాన పంటలైన మిర్చి తదితర కూడా పరిశీలించారు. జిల్లా మీదుగా హంద్రీనీవా పారుతున్నా రైతులకు ఉపయోగం లేదని, వ్యవసాయానికి హంద్రీనీవా నీటిని వాడుకునే విధంగా చూడాలని మద్దికెర మండల రైతులు కోరారు. అనంతరం కర్నూలు చేరుకొని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఖరీఫ్‌ కరువుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. జిల్లాలో నెలకొన్న కరువు తీవ్రతను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి తరపున జేసీ నూరుల్‌ఖమర్‌ సెంట్రల్‌ టీమ్‌కు వివరించారు. కరువు పరిస్థితిపై కేంద్రానికి సమగ్రంగా నివేదిస్తామని సెంట్రల్‌ టీమ్‌ లీడర్‌ పొన్నుస్వామి వెల్లడించారు. సెంట్రల్‌ టీమ్‌ వెంట జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, ఉద్యానశాఖ ఏడీ రాజాకృష్ణారెడ్డి, పత్తికొండ ఏడీఏ మోహన్‌ విజయ్‌, తుగ్గలి, మద్దికెర, పత్తికొండ ఏవోలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement