కర్నూలు: లీగల్ సర్వీసెస్ ఉచిత న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి జిల్లా ప్రజలకు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 9వ తేదీ వరకు జాతీయ న్యాయ సేవ దినోత్సవ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చట్టపరమైన సమస్యలు ఉంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్‌లో ఉన్న లీగల్ సర్వీసులు, జిల్లా కేంద్రంలోని న్యాయ సేవాధికార సంస్థను కానీ సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని సోమవారం నిర్వహించిన సదస్సులో తెలిపారు. లీగల్‌సర్వీసెస్ టోల్‌ఫ్రీ నెంబర్ 15100కు కాల్ చేస్తే వారి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవంపై కళాశాలలు, పాఠశాలల్లో వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి నవంబర్ 9వ తేదీన గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు, లీగల్ ఎయిడ్ మెంబర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.


