పొరుగు మద్యానికి ‘చెక్‌’ పడేనా? | - | Sakshi
Sakshi News home page

పొరుగు మద్యానికి ‘చెక్‌’ పడేనా?

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

అధికారిక దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయించాలి

● జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు

● ఎన్నికల వేళ విస్తృత తనిఖీలు

● బెల్టు దుకాణాల్లో మద్యం విక్రయాలపై

కేసుల నమోదు

కర్నూలు: మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల వేళ మద్యం కీలక పాత్ర పోషించనుంది. పురుష ఓటర్లను ఆకట్టుకునేందుకు, ప్రచారంలో తమ వెంట తిప్పుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు మద్యం ఏరులే పారించడం పరిపాటి. ఎన్నికలు అనగానే నాయకులు డబ్బు, మందు పంపిణీకి తెర లేపుతుంటారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల వేడి నెలకొంది. నవంబర్‌ నెల అంతా ఆ సందడే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నాయకులు మద్యం పంపిణీ చేసే ఆస్కారం ఉంది. ఇందుకు గాను ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమ మార్గంలో తెస్తుంటారు. వీటిపై పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులు నిఘా పెంచి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

జిల్లాలోకి వచ్చే మార్గాల్లో నిఘా

జిల్లాలోకి వచ్చే మార్గాల్లో నిఘా పెంచారు. సాధారణ సమయాల్లో పోల్చితే ఎన్నికల సమయంలో కర్ణాటక, తెలంగాణ నుంచి అధికంగా మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. వాహనాలు మారుస్తూ అధికారుల కన్నుగప్పి మద్యం అక్రమ రవాణా చేస్తారు. ఏ ఎన్నికలైనా మద్యం ఏరులై పారుతుందనేది జగమెరిగిన సత్యం. ఇదే క్రమంలో అక్రమ మద్యంపై అటు పోలీసులు, ఇటు ఎకై ్సజ్‌ శాఖ దృష్టి సారించింది. మద్యం బెల్టు దుకాణాలపై ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో నడిచే టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దాడులు మొదలుపెట్టారు. అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేస్తున్నారు.

విస్తృత తనిఖీలు

పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా సరిహద్దుల్లో ఇప్పటికే ఉన్న ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నిఘాను పెంచి తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అటు పోలీసు, ఇటు ఎకై ్సజ్‌ శాఖ అధికారులు సంయుక్త కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే ప్రత్యేకంగా మొబైల్‌ స్క్వాడ్‌తో పాటు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి అంతర్రాష్ట మద్యం జిల్లాలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేస్తున్నారు.

పొంచి ఉన్న నకిలీ మద్యం ప్రమాదం

ఎన్నికల నేపథ్యంలో డిమాండ్‌ మేరకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకోవడంతో పాటు నకిలీ మద్యం ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇది ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు. ఎన్నికల నేపథ్యంలో ఎకై ్సజ్‌, పోలీసు శాఖలు పొరుగు రాష్ట్రాల మద్యంతో పాటు కల్తీ మద్యంపై కూడా దృష్టి సారించాల్సి ఉంది.

లైసెన్స్‌దారులు అధికారిక దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయించాలి. నిర్దేశిత సమయాల్లోనే తెరవాలి. అదే విధంగా మూసివేయాలి. సీసీ కెమెరాల్లో నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. దుకాణాల వారీగా నెలవారీ సరఫరా లెక్కలు తీస్తున్నాం. గత ఏడాది అక్టోబర్‌ నెలలో ఎంత సరుకు అమ్మకం జరిగింది, అంత మేరకే ఈనెల కూడా విక్రయాలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నాం.

– ఎం.సుధీర్‌ బాబు,

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ జిల్లా అధికారి

రెండు నెలల్లో 307 కేసుల నమోదు

అక్రమ మద్యం నిల్వలపై ఎకై ్సజ్‌ అధికారులు దాడులు ఉధృతం చేసి 207 కేసులను నమోదు చేశారు. 176 మంది ముద్దాయిలను అరెస్టు చేసి 188.67 లీటర్ల పొరుగు రాష్ట్రాల మద్యం, 85 లీటర్ల ఎన్‌డీపీఎల్‌, 205 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 8 వాహనాలను సీజ్‌ చేశారు.

సెప్టెంబర్‌ నెలలో 171 కేసులు నమోదు చేసి 113 లీటర్ల మద్యం, 89 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 92 మంది నిందితులను అరెస్ట్‌ చేసి నాలుగు వాహనాలు సీజ్‌ చేశారు.

అక్టోబర్‌ నెలలో ఇప్పటి వరకు 36 కేసులు నమోదు చేశారు. అలాగే 85 లీటర్ల మద్యం, 175 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 84 మంది నిందితులను అరెస్ట్‌ చేసి నాలుగు వాహనాలు సీజ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement