గడువులోగా బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ | - | Sakshi
Sakshi News home page

గడువులోగా బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

● జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ఏ సిరి

కర్నూలు(అర్బన్‌): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, పంపిణీ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో జరుగుతున్న బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ ప్రక్రియను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణలో ఎలాంటి అక్షర దోషాలు, ముద్రణ లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల బ్యాలెట్‌ పేపర్లను విభజించి సక్రమంగా అమర్చుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో బ్యాలెట్‌ పేపర్లు చాలా కీలకమని అధికారులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ పూర్తి అయిన అనంతరం మండలాలకు సకాలంలో చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నూరుల్‌ఖమర్‌, జెడ్పీ సీఈఓ ఆర్‌ సుధాకర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి సంజీవరాజు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement