నెల నుంచే నీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

నెల నుంచే నీటి కష్టాలు

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

నెల నుంచే నీటి కష్టాలు 6 నెలలుగా ఇక్కట్లు

మాది కౌతాళం మండలం సులేకేరి గ్రామం. మా గేరికి నీళ్లు రాక నెలయ్యింది. పైపులైన్‌ రిపేరీ చేయకుండా అలాగే వదిలేయడంతో మంచి నీరు రావట్లేదు. అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చేదుడు బావి నీటినే తాగుతున్నాం. ఈ నీరు తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఓటు అడగడానికి వచ్చే వాళ్లను నిలదీస్తాం.

– పల్లవి, సులేకేరి

కోసిగి మండలం దొడ్డి గ్రామం మాది. మా గేరి కొండ ప్రాంతంలో ఉంది. నీళ్లు రాక 6 నెలలు అవుతోంది. 200 ఇండ్లకు తాగునీరు కరువైంది. కింది గేరికి వెళ్తే అక్కడి జనం నీళ్లు వదలడం లేదు. పంట పొలాల బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నాం. అధికారులు మా కష్టాలు పట్టించుకుంటే బాగుండు.

– నాగరాజు, దొడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement