ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

దేవనకొండ: మండలకేంద్రమైన దేవనకొండకు చెందిన హోటల్‌ నూర్‌ అహమ్మద్‌ మనవడు షాకీర్‌ అహమ్మద్‌ బుధవారం అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పుటకలమర్రి మోడల్‌ స్కూల్‌లో ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడని, గురువారం ఉదయం 8: 30 గంటలకు బస్సు ఎక్కి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని వాపోయారు. విద్యార్థుల బంధువులను, ఇరుగుపొరుగు గ్రామాల్లో విచారించినా ఆచూకీ లభించలేదన్నారు. దేవనకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9703596013, 9666599033 నంబర్‌లకు తెలియజేయాలని కోరారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

కర్నూలు (టౌన్‌): వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్‌లోని విల్లాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి అండర్‌–17 బాలుర స్కూల్‌ గేమ్స్‌ ఫుట్‌బాల్‌ పోటీలకు స్థానిక నరసింగరావు పేటలోని శ్రీ లక్ష్మీ స్కూల్‌ విద్యార్థి సాథ్‌ ఎన్నికయ్యాడు. గురువారం స్కూల్‌ డైరెక్టర్‌ పి. దీక్షిత్‌ విద్యార్థిని అభినందించారు. ఆయన మాట్లా డుతూ ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు రాజమహేంద్రవరంలో నిర్వహించిన అండర్‌–17 బాలుర ఫుట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ చాటి జతీయ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు.

నేటి నుంచి మద్యం దుకాణాల బంద్‌

కర్నూలు(సెంట్రల్‌): నవంబర్‌ ఒకటో తేదీన కర్నూల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ అధికారులు దుకాణాలకు సీల్‌ వేసి ఎన్నికల రోజు సాయంత్రం ఐదు గంటల వరకు మద్యం అమ్మకాలు జరక్కుండా చూడాలని ఆదేశించారు.

రిమాండ్‌ ఖైదీలు కోర్టు వాయిదాలకు హాజరవ్వాలి

నంద్యాల(వ్యవసాయం): రిమాండ్‌ ఖైదీలు కోర్టువాయిదాలకుకు తప్పకుండా హాజరువ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. గురువారం స్థానిక జైలును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులోని పరిసరాలను పరిశీలించి పలు సూచనలిచ్చారు. అదేవిధంగా ఖైదీల వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయ న్యాయవాదిని నియమిస్తామన్నారు. 70 ఏళ్లు వయస్సు పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 1500పై ఖైదీలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ గురుప్రసాద్‌రెడ్డి, న్యాయవాది నాయక్‌, లోక్‌అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ : ఖైదీలకు అన్ని రకాల హక్కులు కల్పించేందుకు న్యాయస్థానాలు సహకరిస్తాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి లీలావెంకట శేషాద్రి తెలిపారు. స్థానిక సబ్‌ జైల్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట జైలు అధికారి బాబు, న్యాయవాదులు బాబాపకృద్దీన్‌, షహీనాబేగం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement