స్థానిక ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

Oct 28 2026 12:36 AM | Updated on Oct 28 2026 12:36 AM

కర్నూలు(సెంట్రల్‌): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు నగరంలోని ప్రభుత్వ సిల్వర్‌ జూబ్లీ కళాశాల, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ హాళ్లు, రిసెప్షన్‌ కేంద్రాలను జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌లతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది, ఎన్నికల ప్రక్రియకు హాజరయ్యే ఇతర వ్యక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా గుర్తించాలన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈవో సుధాకర్‌ రెడ్డి, కర్నూలు ఆర్డీవో సందీప్‌ కుమార్‌, తహసీల్దార్లు వెంకట రమేష్‌ బాబు, ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement