రాష్ట్రంలో రాక్షస పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాక్షస పాలన

Oct 28 2026 12:36 AM | Updated on Oct 28 2026 12:36 AM

ఆలూరు రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతోందని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. మండలంలోని మొలగవల్లి గ్రామ టీడీపీకి చెందిన 50 కుటుంబాలు మంగళవారం వైఎస్సార్‌ సీపీలో చేరాయి. చిప్పగిరి మండల కేంద్రంలోని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నివాసంలో వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ఇన్‌చార్జ్‌ వైకుంఠం జ్యోతి వైఖరితో విసిగిపోయి పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. సంక్షేమ పాలన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువైందన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారికి సముచిత గౌరవంతో పాటు తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. వైఎస్సార్‌ సీపీలో చేరిన వారిలో దాసరి రమేష్‌, కందనాతి సుధాకర్‌, రాజు, మాణిక్యం, బంగారి నరసప్ప, పోపిని రోషన్న, వీరాంజినేయులు, గోపి, ఈరన్న, గఫూర్‌, గోపి, ఉమేష్‌, సతీష్‌, గోపిని వీరాంజినేయులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement