‘మున్సిపోల్స్‌’పై పోలీస్‌ ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

‘మున్సిపోల్స్‌’పై పోలీస్‌ ఫోకస్‌

Oct 28 2026 12:36 AM | Updated on Oct 28 2026 12:36 AM

2వేల మంది సిబ్బందితో కార్యాచరణ ప్రణాళిక

172 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు

ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

మున్సిపాలిటీల వారీగా వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల వివరాలు ఇలా...

కర్నూలు: పుర పోరుకు పోలీసు అధికార యంత్రా ంగం సిద్ధమవుతోంది. శాంతిభద్రతలు, బందోబ స్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తది తర అంశాలను దృష్టిలో పెట్టుకుని సుమారు రెండు వేల మంది సిబ్బందితో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1వ తేదీ పోలింగ్‌ జరగనుంది. 780 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాదేశిక ఎన్నికల హడావుడి కూడా మొదలు కావడంతో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అదనపు సిబ్బందితో బందోబస్తు విధులకు కేటాయించనున్నారు.

సమస్యాత్మక ప్రాంతాలు, కేంద్రాలపై దృష్టి

మున్సిపాలిటీల్లో 172 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. వీటిలో అత్యంత సమస్యాత్మక కేంద్రాలను నిర్ధారించాల్సి ఉంది. సమస్యాత్మక కేంద్రాల్లో కర్నూలులో 110 ఉండగా, ఆ తర్వాత ఆదోనిలో 27 ఉన్నాయి. అన్ని సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాలను మొహరించడం ద్వారా శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు ప్రణాళిక రూపొందించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బారీకేడ్ల ఏర్పాటు, వసతి సౌకర్యం, మంచినీటి సౌకర్యం, దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లేందుకు ర్యాంప్‌ సౌకర్యం, అదనపు గదులు తదితర వాటిపై మున్సిపల్‌ అధికారులతో కలసి సంయుక్త తనిఖీలు నిర్వహించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా నిఘా ఉంచనున్నారు. పోలింగ్‌ రోజు ఆయా ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించనున్నారు.

ట్రబుల్‌ మాంగర్స్‌పై నిఘా

ఎన్నికల సందర్భంగా గొడవలకు దిగే అవకాశం ఉన్న వ్యక్తుల (ట్రబుల్‌ మాంగర్స్‌)పై నిఘాకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో గొడవల్లో పాల్గొన్న వారు, కారకులైన వారి కదలికలను నిశితంగా పరిశీలించేందుకు మఫ్టీ బృందాలను రంగంలోకి దించుతున్నారు. ట్రబుల్‌ మాంగర్స్‌, రౌడీషీటర్లు సుమారు 4 వేల మందికి పైగా ఇప్పటికే బైండోవర్లు పూర్తి చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులు పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నారు.

మున్సిపాలిటీ వార్డులు పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలు ఓటర్ల సంఖ్య

కర్నూలు 68 487 110 4.87 లక్షలు

ఆదోని 52 179 27 1,76,674

ఎమ్మిగనూరు 44 91 19 84,939

గూడూరు 23 23 16 17,665

పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement