కర్నూలు(అర్బన్): జిల్లాలో 432 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 74 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 358 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు సంబంధించి మొత్తం 907 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 349 మంది, టీడీపీ అభ్యర్థులు 337 మంది. కాగా కోసిగిలో 20 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే క్రిష్ణగిరిలో 13 ఎంపీటీసీ స్థానాలకు 12, వెల్దుర్తిలో 17 ఎంపీటీసీ స్థానాలకు 15 ఏకగ్రీవమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆదోని–1, ఆదోని–2, ఆస్పరి, సి.బెళగల్, దేవనకొండ, గోనెగండ్ల, గూడూరు, కల్లూరు, కోడుమూరు, మద్దికెర, నందవరం, ఓర్వకల్లు, పెద్దకడుబూరు, తుగ్గలి, ఎమ్మిగనూరు మండలాల్లో ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా ఏకగ్రీవం కాకపోవడంతో ఆయా మండలాల్లోని అన్ని ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పంచాయతీ పోరుకు సన్నాహాలు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని 484 గ్రామ పంచాయతీలు, 5,100 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్థానిక జిల్లాపరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో భద్రపరచిన ఎన్నికల సామగ్రిని మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్, డీఎల్‌పీఓ టి.లక్ష్మి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రినంతటినీ మండలాల వారీగా విభజించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ మాట్లాడుతూ సిద్ధంచేసిన సామగ్రిని రెండు మూ డు రోజుల్లో సంబంధిత ఎంపీడీఓల ద్వారా మండలాలకు చేర్చే ప్రక్రియను చేపడతామన్నారు.
ఖైదీలు తమ హక్కులు తెలుసుకోవాలి
ఆదోని రూరల్: జైలులోని ఖైదీలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని సబ్‌జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. 70 ఏళ్ల వయస్సు పైబ డిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నా రు. ఖైదీలను కోర్టులకు కచ్చితంగా హాజరు చేయా లని ఆదేశించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్ 15100పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎల్‌ఏడీసీ శివకుమార్, జైలు సూ పరింటెండెంట్ నజీర్‌అహమ్మద్, జైలు విజిటింగ్ అడ్వకేట్ బి.నవీన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రకటనలకు ఎంసీఎంసీ
ధ్రువీకరణ తప్పనిసరి
కర్నూలు(సెంట్రల్): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇచ్చే ప్రకటనలకు ముందస్తుగా ఎంసీఎంసీ ధ్రువీకరణను తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం కర్నూలు కలెక్టరేట్‌లోని సీపీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ సెల్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు. అనుమతి తీసుకోకుండా ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు సంబంధిత ఆర్వోల ద్వారా నోటీసులు జారీ చేస్తామన్నారు.
నేడు వీబీజీ రామ్‌జీపై సమీక్ష
కర్నూలు(అగ్రికల్చర్): వీబీ జీ రామ్ జీ కార్యక్రమాలపై ఈ నెల 28న ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరుగనుంది. సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్ కమిషనర్ ఎం.శివప్రసాద్ పర్యవేక్షణాధికారిగా హాజరు కానున్నారు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు నంద్యాలలో.. మధ్యాహ్నం 3 గంటల నుంచి కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో సమీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. సమావేశాలకు టెక్నికల్ అసిస్టెంట్లు మొదలు కొని ఏపీవో, ఏపీడీ వరకు పూర్తి స్థాయి వివరాలతో హాజరు కావాలన్నారు.


