సోషల్ మీడియా ఇన్‌ప్లుయన్సర్ల పాలసీ పథకం పెట్టి రూ. కోట్ల ప్రజాధనం వృథా చేసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు. గత వైఎస్సార్ ప్రభుత్వంలో వలంటీర్లుగా ప్రజలకు ఎంతో సేవ చేసిన మాకు ప్రభుత్వం పారితోషికం అందజేస్తే ఆనాడు ప్రజాధనం దుర్వినియోగమంటూ.. ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు విమర్శించారు. ఇప్పడు సోషల్ మీడియా ఇన్‌ప్లుయన్సర్ల ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలి. సోషల్ మీడియా ఇన్‌ప్లుయన్సర్ల పాలసీ ద్వారా ప్రజల సొమ్ము టీడీపీ కార్యర్తలకు దోచిపెట్టడం తప్పా ప్రజలకు ఒరిగిందేమి లేదు. ఈ విషయంలో ప్రభుత్వం పునారాలోచన చేయకపోతే వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు.
– హనుమంతు, మాజీ వలంటీర్,
ములుగుందం గ్రామం. ఆస్పరి మండలం


