కరువు కోరల్లో చిక్కుకొని.. | - | Sakshi
Sakshi News home page

కరువు కోరల్లో చిక్కుకొని..

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

కరువు విలయానికి రైతుల విలవిలలాడుతున్నాడు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు చేతికందడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు గిడసబారి పోవడంతో తొలగించాల్సి వస్తోంది. గూడూరు పట్టణానికి చెందిన బోజుగు సాగర్‌ అనే కౌలు రైతు రెండు ఎకరాల పొలాన్ని ఎకరా రూ.15 వేల చొప్పున కౌలుకు తీసుకొని ఎకరాకు రూ. 20 వేల పెట్టుబడి పెట్టి చౌళకాయ సాగు చేశాడు. అయితే తీవ్ర వర్షభావ పరిస్థితుల వల్ల పంట ఎదుగుదల లోపించి దిగుబడి రాలేదు. దీంతో రోటావేటర్‌ సహాయంతో పంటను తొలగించాడు. కరువుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు బోజుగు సాగర్‌ కోరుతున్నాడు.

– గూడూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement